2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కువ శాతం హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా రాకముందు వారంలో కొన్నిరోజులు ఏపీలో ఉండి, వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్ళేవారు. ఇక కరోనా ఎంటర్ అయ్యాక బాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అటు నారా లోకేష్ సైతం తండ్రితో పాటే హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో ఏపీలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు అధికార పార్టీ రోజురోజుకూ బలపడుతుంటే, టీడీపీ వీక్ అవుతూ వచ్చింది.