బీజేపీ వారు తెలంగాణ ప్రజల్లో మాకు ఆదరణ ఉందని నిరూపించుకోవడానికి , విద్యుత్తు చట్టాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారని, దుబ్బాకలో వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనమని వాదించాలన్నది వారి ఎత్తుగడ. ఎన్నడూ లేనట్టు ఓట్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నది అందుకే. మోసకారి మాటలు మోస్తున్నదీ అందుకే. కేసీఆర్పై, టీఆర్ఎస్పై నీలాపనిందలు వేస్తున్నది. అర్ధంలేని ప్రచారంతో బీజేపీ అనుకూల మీడియా వారు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.