గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా వైద్యం మరియు ఆరోగ్యం విషయంలో దారుణంగా విఫలమైంది. ఇప్పుడు ఈ రంగాలను బలోపేతం చేయడానికి నాడు నేడు కార్యక్రమం ద్వారా 17 ,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా కొత్తగా నిర్మించే 16 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ పనులను జనవరి లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.