తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విఆర్ఓ ల నూతన జాబితా సమస్య, వీరి నియామకాల వ్యవహారం ఓ వైపు అయితే ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు. దీని గురించి రోజూ ఏదో ఒక వార్త తెలంగాణ సర్కారును ప్రశ్నించేలా చేస్తున్నాయి. అయితే తాజాగా దీనికి స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి శుభవార్తను అందించారు. వీలైనంత త్వరలోనే విఆర్ఓ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.