కిడ్నాపర్లు, సైబర్ నేరగాళ్లు,హ్యాకర్లు అంతర్జాతీయ స్థాయిలో రూపాయలు, డాలర్లు, పౌండ్లు, యూరో వివిధ రకాల కరెన్సీలను బిట్ కాయిన్ల రూపంలోకి మార్చి తమకు పంపించాలంటూ బాధితులను డిమాండ్ చేస్తున్నారు. తద్వారా వారు ఎవరన్న విషయం బయట పడకుండా వివరాలు సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఇటీవల సైబరాబాద్ పరిధిలో కిడ్నాప్ నకు గురైన డాక్టర్ ను దుండగులు రూ. 10 కోట్లు ఇస్తేనే విడిచి పెడతామంటూ డిమాండ్ చేశారు... అందులోనూ వారు అడిగిన మొత్తాన్నిబిట్ కాయిన్లలో తమకు పంపించాలంటూ హెచ్చరించారు.