ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు మధ్యలో ఇటు ప్రభుత్వానికి అటు ఎన్నికల సంఘానికి సయోధ్య కుదరడం లేదు. మరో వైపు ఎలాగూ ఉన్నారుగా చంద్రబాబు అండ్ బ్యాచ్. అధికారపార్టీకి... ప్రతిపక్ష పార్టీలకు ఈ మధ్య విభేదాలు ఎప్పుడూ ఉండే సర్వ సాధారణమైన విషయమే. రాజకీయం అన్న తర్వాత ఆ మాత్రం ఎత్తిపొడుపులు ఉంటాయి. కానీ ఈ మధ్య మన నేతలు మాట్లాడుతున్న వ్యవహార శైలి కాస్త శృతిమించుతోంది అని అంటున్నారు పలు రాజకీయ వర్గాల నేతలు.