గతంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కోర్టులో పిటీషన్లు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1999, ఆగస్టు 13న మరియు 1999 సెప్టెంబరులో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కొన్ని కారణాలచేత 2000 సంవత్సరం డిసెంబరు 12న ఈ పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నారు.