హైదరాబాద్ కానిస్టేబుల్ బాబ్జీ తాజాగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ అంబులెన్స్‌కు దారి చూపించి.. ఒక రోగి నిండు ప్రాణాలు కాపాడిన విషయంలో ఒక్కరోజులో హీరో అయిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి రావు ఈ హరీష్ రావు.. బాబ్జీ ని అభినందిస్తూ ట్వీట్ చేయడం అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా గర్వంగా ఉందని పోలీసు సోదరులంతా కొనియాడుతున్నారు.