ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా విజయశాంతి వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె  దుబ్బాక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ఆలోచించేలా చేసింది. ప్రస్తుతానికైతే బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నిరోధించగలిగింది... కానీ తమ పార్టీని బలోపేతం చేసేందుకు విజయశాంతిని ఎలా ప్రసన్నం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ నాయకుడు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజయశాంతికి మధ్య విభేదాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.