బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అమెరికా తరహా ఫలితమే వస్తుందంటూ.... అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అంటూ విమర్శించింది. అగ్రరాజ్యంలో ట్రంప్ ఎలా పరాజయం పాలయ్యాడో... ఇక్కడ జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ కూడా పరాజయం పాలు కావడం తథ్యం అంటూ కామెంట్ చేశారు. అమెరికాలో భారీ అంచనాలు ఉన్న ట్రంపే ఓడిపోయాడు... అలాంటిది ఇక్కడ నితీశ్‌కుమార్ ఓడిపోవడం తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.... ఎన్నికల ఫలితాలు వస్తే విషయం అందరికీ అర్థమవుతుంది అంటూ విమర్శించారు.