బీహార్ లో కింగ్ మేకర్ గా వెలుగొందిన లాలూ ప్రసాద్ యాదవ్ గురించి దేశమంతా తెలిసిందే. అయితే తెలియని విషయం ఏమిటంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి మరియు సమయం బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు బీహార్ రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన లాలూ ప్రస్తుతమ కొన్ని కేసుల విషయంలో జైలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మీడియా సమాచారం ప్రకారం అయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్లు తెలిసింది. శరీరంలోని అన్ని భాగాల పనితీరు సరిగా లేదని డాక్టర్స్ తెలిపినట్లు సమాచారం.