ఏపీలో వారసత్వ రాజకీయాలకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పొచ్చు. సీనియర్ నేతలంతా తమ వారసులని ఎప్పటికప్పుడు రంగంలోకి దింపేస్తుంటారు. 2019 ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని ఎన్నికల్లో పోటీ చేయించారు. ఎక్కువగా టీడీపీలో ఈ వారసత్వ రాజకీయాలు నడిచాయి. ఒక కుటుంబానికి ఒకే సీటు అని చంద్రబాబు కండిషన్ పెట్టడంతో పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని బరిలో దింపారు.