ఏపీ రాజధాని ఏది? అంటే ఇంకా క్లారిటీ లేదనే పరిస్థితి ప్రజల్లో ఉందనే చెప్పొచ్చు. రాష్ట్ర విభజన జరిగాక హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉంటూ, కృష్ణా జిల్లాకు ఆనుకుని ఉన్న 29 గ్రామాల్లో భూములు సమీకరించి బాబు రాజధాని కట్టాలని భావించారు.