ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గోడ దూకుడు కార్యక్రమం ఏపీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండలేక అధికారం కోసం ఎమ్మెల్యేలు జంప్ అయిపోతూ ఉంటారు. గతంలో అధికారంలో టీడీపీలోకి కూడా వలసలు అలాగే నడిచాయి. 23 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అందులో నలుగురుకు బాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అధికారం వైసీపీకి వచ్చింది. కాకపోతే జగన్ పార్టీలో చేరేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పడంతో వలసలు ఉండవని అంతా అనుకున్నారు.