త్వరలో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నవంబర్ నెలాఖరులో సమావేశాలు ఏర్పాటు చేసి కీలక బిల్లులని ఆమోదించుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు గొడవ పడే వేదికగా మారిపోయాయి. ప్రజా సమస్యలపై చర్చలు జరగడం కంటే, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎక్కువైపోయింది. ఈ విషయంలో రెండు పక్షాలు తక్కువ కాదనే చెప్పొచ్చు.