ప్రస్తుతం హైదరాబాదులో జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని విషయాలలోను తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు 50 వేల కంటే ఎక్కువ నగదు పట్టుబడితే.. దానికి సంబంధించిన రసీదు ఉండాలని లేదా నగదు సీజ్ చేస్తామని షాక్ ఇచ్చారు. ఎన్నికల వేళ హవాలా గ్యాంగ్స్ ల విషయంలో అలర్ట్ అయిన పోలీసులు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.