బండి సంజయ్ తనని మోసం చేశారన్న మాట వాస్తవం అని పేర్కొన్నారు. అంతేకాకుండా నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్ఎంసీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలని అడగడం వాస్తవం అని తెలిపారు. అందులోనూ మిగిలిన 150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని కూడా చెప్పాను. కానీ ఇక్కడ నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ తమకు నచ్చింది తాము చేసుకుంటూ పోతున్నారు.