ఏపీలో మంత్రులని ప్రతిపక్ష పార్టీలు ఏదొరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఏదొక అంశం మీద మంత్రులని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఇంకా పలు మంత్రులపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.