నిజానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని.. వైఎస్ కుటుంబంపై తనకు ఎలాంటి విరోధం లేదని తెలియజేశారు.  గతంలో వైఎస్ కటుుంబంపై కేసీఆర్ మాట్లాడిన మాటల్ని తాను గుర్తు చేసినట్లుగా చెప్పారు. గతంలో తాను వైఎస్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ.... తను జారిన మాటను సరిచేసుకోవాలని ప్రయత్నించారు రఘు నందన్. తను మాట్లాడిన మాటలకు అర్థం అది కాదని నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను తప్పుగా మాట్లాడలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే.. తప్పుగా అర్థమైతే తనను క్షమించాలి అంటూ క్షమాపణ కోరారు.