చెన్నైలో మొదలైన నివర్ తుఫాన్ ప్రభావం. నిన్న( మంగళవారం) నుండి మొదలైన భారీ వర్షాలు. నిన్న భారీ వర్షంతో తడిసి ముద్దయింది చెన్నై. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.... లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, రోడ్లపై పెద్ద ఎత్తున నీళ్లు నిలచి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే నివర్ తుఫాను చెన్నైకి దక్షిణాన తీరం దాటుతుందని భావిస్తున్నా... అటు దక్షిణాంధ్ర ప్రాంతం పైన కూడా విపరీతంగా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.