ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు వరద సాయాన్ని అందించాలి అనుకుంటే... అందుకు బీజేపీయే అడ్డుకుందని మరోసారి ధ్వజ మెత్తారు. ప్రజలను కలిసి ఉండండి అని చెప్పాల్సింది పోయి మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు... మోసపోవద్దు అర చేతిలో స్వర్గం చూపిస్తే నమ్మేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్ చేస్తామని అమిత్ షా హామీలు ఇస్తే.. దాన్ని అంత ఈజీగా నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని... ఎందులో ఎంత నిజముందో అందరికీ తెలిసిందే అన్నారు.