మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే… కాస్త అటు ఇటు గా 102 ఓట్ల బలం అవసరమవుతుంది. ఇది ఇది ఆయా పార్టీల బలాల పై ఆధారపడి ఉంటుంది. ముందుగా అధికార పార్టీ టీఆర్ఎస్ లెక్కలు చూస్తే… ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కప్రకారం టీఆర్ఎస్ గెలవాల్సిన డివిజన్లు 65గా ఉన్నాయి. మంచి జోరు మీదున్న కారుకు ఇది పెద్ద విషయం కాదని అంచనా వేస్తున్నారు.