గత కొన్ని రోజులుగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఓటింగు మొదలయింది. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలపై మీడియా వారు రక రకాల ఊహాగానాలతో ఓటర్లకు అయోమయ స్థితిని కలిగిస్తున్నారు. అయినా సరే వారికంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకోండి. ఈ రోజు అందరి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి.