గ్రేటర్ ఎన్నికల పోలింగు శాతం 47 కి పడిపోయింది. దీనితో ఓటింగు శాతం పైనే గెలుపు ఆధారపడి ఉంటుందని అంచనా వేసిన కొన్ని పార్టీల ఆశలు నీరు గారిపోయాయని చెప్పవచ్చు. ఓటింగు పూర్తి కావడంతో రక రకాల ఎగ్జిట్ పోల్స్ వాటి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే వివిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికలలో నూటికి నూరు శాతం విజయం తెరాస దేనని తెలుస్తోంది. అయితే ఈ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎక్కడ ఫెయిలయింది అనే విషయాన్ని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.