ముగిసిన గ్రేటర్ ఎలక్షన్. మంగళవారం ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి సందడి కరువైంది. ఓటర్లు పెద్దగా ఎలక్షన్ ప్రాంతాలలో కనిపించలేదు. కారణాలు అటుంచితే గత ఏడాది కన్నా ఈసారి పోలింగ్ శాతం మాత్రం తక్కువ అని తేలింది. ప్రచారాలలో పెద్ద ఎత్తున ప్రసంగాలు చేసినప్పటికీ... ఓవైపు పోలీసులు, మరోవైపు నాయకులు ఓటు అన్నది హక్కు కాదు... ప్రతి ఒక్కరి బాధ్యత అని మొరపెట్టుకున్నా.... ఓటర్లకు మాత్రం అవి ఏవీ పెద్దగా పట్టించుకోనట్లే ఉంది వ్యవహారం.