గ్రేటర్ ఎన్నికలపై నిఘా వర్గాలు అందజేసిన రిపోర్టుతో ప్రభుత్వం సంతోషంగా ఉందంటున్నారు. వారు కోరుకున్న అంత కాకపోయినా... మంచి ఫలితాల్ని సొంతం చేసుకోవటం గ్యారంటీ అని వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కనిపించిన పోటీ వేళ.. అధికార పార్టీ అంచనాలకు కాస్త అనుగుణంగానే ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ తో పాటు.. ఎగ్జిట్ పోల్ మీద ఉన్న పరిమితుల నేపథ్యంలో వివరాల్ని బయటకు ప్రకటించడం కుదరదన్న విషయం తెలిసిందే.