ఇప్పటివరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా తెరాస రెండో స్థానంలో ఉంది. మొత్తంగా 74 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, అలాగే తెరాస 35 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.ఎప్పుడూ లేనంత విధంగా పోస్టుల బ్యాలెట్ ఓట్లలో 1926 లెక్కించగా అందులో 40 శాతం ఓట్లు చెల్లలేదని కౌంటింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేసిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులు అయి ఉండవచ్చు.