బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుజనా చౌదరి ఇంటి సభ్యులు తీవ్రమైన దుఃఖంతో కృంగిపోతున్నారు. సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు(88) అనారోగ్య సమస్య కారణంగా శనివారం కన్నుమూశారు. దాంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖానికి గురయింది. జనార్ధనరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 నిముషాలకు జరిపించపోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.