రాజ్యాంగంలోని 243కె అధికరణ ప్రకారం ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని తెలియజేశారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే ఎన్నికలు నిర్వహించాలని ఆర్డినెన్స్ తీసుకువస్తే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించాల్సిందిగా గవర్నర్ను ఎస్ఈసీ కోరారు. మరి గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ విజ్ఞప్తిపై ఎలా స్పందించనున్నారో చూడాలి. ఈ ఎన్నికల అంశం ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.