రైతులకు కొండంత అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారికి అన్యాయం తలపెడుతుంది అంటూ ధ్వజ మెత్తారు. మీకు నిజమైన ధైర్యం బలం ఉంటే నేరుగా మమ్మల్ని అరెస్ట్ చేయండి. లేదంటే నాకు నేనుగా లొంగి పోతాను. రైతుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు నేనే రైతుల కోసం ఉరి తీసుకోవడానికి సైతం రెడీగా ఉన్నాను అంటూ సవాల్ చేశారు తేజస్వి యాదవ్.