తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ కూడా రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు తేనె పూసిన కత్తి లాంటివని, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని..వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ధ్వజమెత్తారు.