ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ చూస్తుంటే, నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి, ఎన్నికలకు నిర్వహించడానికి సిద్ధంగా లేమని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కరోనా కేసులు నమోదవుతున్న వేళ ఎన్నికలు నిర్వహించలేమని వైసీపీ మంత్రులు చెబుతున్నారు.