కృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి కాస్త అనుకూల ఫలితాలు వస్తాయి. 2014 ఎన్నికల్లో సైతం ఇదే జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. వైసీపీ 14 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. టీడీపీకి రెండు స్థానాలే దక్కాయి. అయితే 2014లో, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తిరువూరు ఒకటి.