బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు గడిచిపోయింది. అయితే ఈ కేసులో పలు ఆరోపణలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ అంశంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లు.... ఈ డ్రగ్స్ కోణం ఒకదానికొకటి ముడిపడి పెద్ద ఊబిలా కనిపిస్తోంది.