తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని తెలియజేశారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరి అభిప్రాయాలను తెలుసుకున్నామని మీడియా ముఖంగా ఆయన వెల్లడించారు.