కృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలమైన జిల్లా. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఫలితాలు టీడీపీకే కాస్త అనుకూలంగా వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఇందులో వల్లభనేని వంశీ సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ బలం మరింత పెరిగింది. టీడీపీ బలం తగ్గుతూ వస్తుంది.