నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే గుర్తొచ్చే అంశం అతని అత్యంత క్రూరమైన పాలన. ఆ దేశంలో అతడి మాటే వేదం... హద్దు మీరి ప్రవర్తించిన వారికి తప్పదు మరణం. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వ్యవహారశైలి ఎవరికీ అంతుబట్టదు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడిగా పేరున్న కిమ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.