కన్నా లక్ష్మీనారాయణ....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు. రాష్ట్రం విడిపోక ముందు వరకు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు ఎలా మారయో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లింది. దీంతో నేతలంతా టీడీపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. ఇదే సమయంలో కన్నా సైతం వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.