ఏపీ లో రాజకీయ రంగం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య నిప్పు వేయకుండానే అగ్గి రాజుకుంటోంది. ఎప్పుడు చూసినా పరిస్థితి పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉంది. విమర్శలు ప్రతి విమర్శలతో.... రాజకీయ రంగం రణరంగంగా మారుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా... ఏదో ఒక విషయం పై వార్తల్లో నిలుస్తున్నారు నేతలు. అయితే తాజాగా ఇరు పక్షాల మధ్య మరో వివాదం వెలుగు చూసింది.