అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. సాధారణంగా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వంలో నేతల మధ్య పోరు నడిచింది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం దీనికి అతీతంగా లేదు. పైగా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం, ఇతర పార్టీల నేతలు ఎక్కువగా వైసీపీలోకి రావడంతో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకు అసలు పడటం లేదు. ఇప్పటికే చీరాలలో వైసీపీ నేతల మధ్య రగడ జరుగుతుంది.