ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నారని మొదట్లో చాలారకాలుగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినప్పుడు ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు తప్పితే, జగన్పై విమర్శలు గుప్పించడం చాలా తక్కువ. సోము వీరాజు ఎక్కువగా ప్రతిపక్షంలో చంద్రబాబుని టార్గెట్ చేసుకునే ముందుకెళ్లారు.