ఏపీ రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ కంటూ ఓ క్రేజ్ ఉంది. దశాబ్దాల పాటు అనంతపురం జిల్లాలో ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు పరిటాల ఫ్యామిలీ భవిష్యత్ కష్టాల్లో పడింది. ఆ ఎన్నికల్లో పరిటాల వారసుడు శ్రీరామ్ రాప్తాడు బరిలో దిగి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. శ్రీరామ్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. తప్పనిసరిగా శ్రీరామ్ విజయం ఖాయమని అనుకున్నారు.