ఏపీ రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీ కంటూ ఓ గుర్తింపు ఉంది. దశాబ్దాల పాటు ఆ ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే ఆనం సోదరుల్లో ఒక్కరైన ఆనం వివేకా మరణించడంతో ఫ్యామిలీ కాస్త రాజకీయాల్లో దూకుడుగా ఉండటం తగ్గించేసినట్లు కనిపిస్తోంది. వివేకా మరణం తర్వాత ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి విజయం సాధించారు.