శ్రీకాకుళం జిల్లాలో బీసీ రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని బీసీ నేతల మాటల యుద్ధానికి దిగారు. అయితే ఈ మాటల యుద్ధానికి ప్రధాన కారణం మంత్రి అప్పలరాజు దూకుడు అని తెలుస్తోంది. సాధారణంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత మంత్రి కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశం సీదిరి అప్పలరాజుకి దక్కింది. పలాస నుంచి తొలిసారి పోటీ చేసి అప్పలరాజు విజయం సాధించారు.