ఏపీలో రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి. బెజవాడపై ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు చూస్తూనే ఉంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న విజయవాడ ఎన్టీఆర్ ఎంట్రీతో టీడీపీకి అనుకూలంగా మారింది. తర్వాత వైఎస్సార్ వేవ్‌లో కొంగ్రెస్స్ హవా నడిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి ఆధిక్యం తగ్గింది.