ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేట్లాగా కనిపిస్తోంది. ఆయన తన అనుకూల సమయాన్ని బట్టి రాజకీయాలని చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనకు ఇంతవరకు ఓటమి కూడా రాలేదు. పైగా పార్టీలు మారినా ఆయనకు లాభమే జరిగిందిగానీ, నష్టం జరగలేదు. మొదట టీడీపీ, తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ల్లోకి వెళ్ళివచ్చిన గంటా చివరకు టీడీపీలోనే రాజకీయం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గంటా, ఇప్పుడు అదే టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు.