ఏపీ రాజకీయాలకు సెంటర్‌గా ఉండే విజయవాడపై పట్టు దక్కించుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ చూస్తూ ఉంటుంది. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు నగరంపై పట్టు దక్కించుకోవాలని చూస్తూనే ఉన్నాయి. అయితే మొదట్లో విజయవాడపాయి కమ్యూనిస్టులకు మంచి గ్రిప్ ఉండేది. తర్వాత టీడీపీ వచ్చాక కాస్త అనుకూలంగా ఆ పార్టీకి మారింది. నెక్స్ట్ వైఎస్ వేవ్‌లో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది.