ఉమ్మడి ఏపీలో తిరుగులేని పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాతమైపోయింది. అయితే ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి మారిపోయింది. వైసీపీ చేతిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్కసారిగా ఆ పార్టీ 23 సీట్లకే పరిమితమైపోయింది.