గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ నేతలంతా జగన్ని విమర్శించరు. కొందరు మాత్రమే ప్రతిపక్ష టీడీపీ నేతల మాదిరిగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా జగన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ జైలుకు వెళ్తారని, త్వరలో రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారని, మరో మూడేళ్ళలో జగన్ అధికారంలో ఉండరని మాట్లాడుతూనే ఉన్నారు.