ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందనున్నాయి. పల్లెల్లో ఉండే పేదలకు సెంటున్నర భూమి, పట్టణాల్లో ఉండేవారికి సెంటు భూమి ఇచ్చి, ఇళ్ళు కట్టి ఇవ్వనున్నారు. అయితే ఈ ఇళ్ల పట్టాల విషయంలో విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి.